తుంగతుర్తి, సెప్టెంబర్ 10 : గ్రామాల్లో రైతులు అందరూ తామ సాగు చేస్తున్న పంటను నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏఈవో జోత్స్న అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా రైతుల వరి, కంది, నువ్వులు, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఏ పంట ఏ రకం పంట వేశారనేది డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న వాలంటీర్లకు సరైన సమాచారం అందించాలని కోరారు. ఆన్లైన్ చేయించుకున్న వారికి మాత్రమే సన్న వరి ధాన్యానికి బోనస్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.