నల్లగొండ రూరల్, జూన్ 17 : నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు లబిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.వి ప్రసాద్ అన్నారు. నల్లగొండకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజిరెడ్డి అత్త కొండ సుశీలమ్మ అకాల మరణం పొందడంతో ఆమె నుండి సేకరించిన నేత్రాలను వారి కుటుంబ సభ్యులు మంగళవారం ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు. ఐ డోనేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, పుల్లారావు, దామర యాదయ్య, జయప్రకాశ్‌రెడ్డి, ప్రవీణ్, విజయ్ కుమార్, ప్రనూష, సతీశ్, శైలజ, భాస్కర్, నిమ్మల పిచ్చయ్య, అమరేందర్‌రెడ్డి నేత్రదాత కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.