నల్లగొండ, అక్టోబర్ 22 : ఈ నెల 16వ తేదీన పఠాన్‌చెరు, సంగారెడ్డి నందు జరిగిన 69వ ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు తృతీయ స్థానం సాధించింది. జట్టు విజయంలో నిడమనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రబెల్లికి చెందిన పిట్టల రాధ (9వ తరగతి) కీలక పాత్ర పోషించింది. విద్యార్థిని బుధవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లోనూ పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వాసంతి, వి.రాములు, వి.వీణ, ఎం.సత్యనారాయణ, ఆర్.శేఖర్, ఎండీ అబ్బాస్, జె.మల్లారెడ్డి, పీడీ ఎండీ.షరీఫ్, గణేశ్, ఎన్.యాదగిరి, వి.మల్లయ్య, కె.శోభారణి, ఎస్.గిరి, గ్రామ పెద్దలు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.