‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లగొండ నగరంలోని 1 నుండి 25 వార్డుల వరకు ముఖ్య నాయకులు, కార్పోరేటర్లు, కాంటెస్ట్ కార్పోరేటర్లు పట్టభద్రుల ఓటు నమోదు ఎన్రోలర్లతో జరిగిన సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన....
– మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 15 : పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లగొండ నగరంలోని 1 నుండి 25 వార్డుల వరకు ముఖ్య నాయకులు, కార్పోరేటర్లు, కాంటెస్ట్ కార్పోరేటర్లు పట్టభద్రుల ఓటు నమోదు ఎన్రోలర్లతో జరిగిన సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. ఎన్రోలర్లు, కార్పొరేటర్లు, కాంటెస్టడ్ కార్పోరేటర్లు, ముఖ్య నాయకులు.. నగరంలోని ఎవరికి వారు తమకు సంబంధించిన డివిజన్లలో ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేయాలన్నారు. ఒకవేళ ఇప్పటికే ఓటరు నమోదు చేయించుకున్న వారి వివరాలు తీసుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా నల్లగొండలోని వివిధ డివిజన్లలోని, కాలనీలలో ప్రతి ఇంటికి తిరిగి ఉద్యోగస్తులను, గ్రాడ్యుయేట్లను, గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దని ప్రతి ఒక్కరు కూడా నమోదు కార్యక్రమంలో భాగస్వాములై పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఓటరు నమోదు కోసం ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్లగొండ జిల్లా తిరుగుతున్నానని ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్ వస్తున్నదని, ఇది పార్టీ భవిష్యత్ గెలుపునకు బాట వేస్తుందన్నారు. గతంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయకపోవడటం వల్ల మనం ఓడిపోయామని, కానీ ఈసారి అలా జరగడానికి వీలు లేదని, మూడు జిల్లాలోని మొత్తం 36 నియోజకవర్గాల్లో 34 చోట్ల కాంగ్రెస్ వారి మిత్రపక్షం అధికారంలో ఉందని తెలిపారు. వారి అధికారాన్ని, డబ్బులను అడ్డుకుని తాము ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరుగుండదన్నారు. కావునా ప్రతి ఒక్కరు ఓటరు నమోదుకు కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, ముఖ్య నాయకులు పిన్నపరెడ్డి మదుసూదన్ రెడ్డి, సయ్యద్ జాఫర్, చింతల యాదగిరి, బొజ్జ వెంకటయ్య, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, దండంపెల్లి సత్తయ్య, పొనుగోటి జనార్దన్ రావు, భాషపాక హరికృష్ణ, మాతంగి అమర్, పున్న వెంకన్న, వజ్జ శ్రీనివాస్, అఫ్జల్ ఖాన్, శంషుద్దీన్, పెద్దులు, నరేష్, కోట్ల అశోక్ రెడ్డి, షాగటి వెంకన్న, ఆయా డివిజన్లకు చెందిన ఎన్రోలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

