‘విద్యుత్ ఆర్టిజన్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి’
విద్యుత్ శాఖలో కొన్నేండ్లుగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
తుంగతుర్తి, ఏప్రిల్ 10 : విద్యుత్ శాఖలో కొన్నేండ్లుగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మికులు గత మూడు రోజులుగా డివిజన్ కార్యాలయాల ముందు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమని ఆరోపించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పెద్దలు అధికారం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రెండున్నర ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

