తుంగతుర్తి, సెప్టెంబర్ 04 : తుంగతుర్తి మండల కేంద్రంలోని జాంబవంత యూత్ క్లబ్ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు బొంకూరి రాజు, ఉపాధ్యక్షులు పోలేపాక కృష్ణ, బొంకూరి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కడియం గోపాలకృష్ణ, కోశాధికారి బొంకూరి హరి ప్రసాద్ ఆర్గనైజర్లు బొంకూరి శ్రీకాంత్, కొండ మధు, గేమ్స్ సెక్రెటరీ కడియం భద్రి, కల్చరల్ సెక్రటరీ కొండా విజయ్ సోషల్ మీడియా బొంకూరి అక్షయ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొంకురి రాజు మాట్లాడుతూ.. జాంబవంతు యూత్ క్లబ్ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాంబవంతు క్లబ్ సభ్యులు బొంకూరి మల్లేశ్, తడకమళ్ల మల్లికార్జున్, బొంకురి మధు, బొంకూరి సాయికుమార్, తడకమళ్ల మధు, భాను ప్రకాష్, వెంకన్న పాల్గొన్నారు.