కలెక్టరేట్ ఎదుట అంగన్ వాడీల ధర్నా
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
భువనగిరి కలెక్టరేట్, మార్చి 12 : అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశ్ మాట్లాడుతూ ఏండ్ల తరబడిగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిషారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా ఒక్క పూట కూడా సెలవు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ కుటుంబ సర్వేలు చేయాలని అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, సిలువేరు రమ, అంగన్వాడీ టీచర్లు పద్మ, రమ, ఉమ, శోభ, సునీత, సరిత, సత్యలక్ష్మి, వసంత, ప్రమీల, షాహెదా, శోభ, కల్యాణి, రాధిక, లక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

