రామగిరి, అక్టోబర్ 22 : నేటి ఉపాధ్యాయ తరానికి దార్శనికుడు దివంగత మాజీ ఎమ్మెల్సీ బీరవెల్లి ధర్మారెడ్డి అని నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని పీఆర్టీయూ భవనం వద్ద ఏర్పాటు చేసిన ధర్మారెడ్డి విగ్రహాన్ని పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు, దర్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్మారెడ్డి ఉపాధ్యాయుడుగా పనిచేస్తునే పీఆర్టీయూ సంఘ వ్యవస్థాపక సభ్యుడిగా పీఆర్టీయూ సంఘానికి ఎంతో గుర్తింపు తేవడంతో పాటు ఉపాధ్యాయుల ఎన్నో అపరిష్కృత సమస్యలను పరిష్కరించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నాటి ముఖ్యమంత్రులతో సంప్రదించి సాధించిన విజయాలను తెలిపారు. సంఘానికి, ఉపాధ్యాయులకు ధర్మారెడ్డి చేసిన సేవలను కీర్తించారు. పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ మాట్లాడుతూ.. ధార్మారెడ్డి విగ్రహావిష్కరణ చేసిన జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గాన్ని అభినందించారు. పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విద్యావేత్త ఎంవీ గోనారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు జి.వెంకట్ రెడ్డి, కోల్లు మదుసూదన్ రెడ్డి, సీతారాంచందర్రావు, డివిఎస్ పణికుమార్, బసిరెడ్డి రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు రామకృష్ణరెడ్డి, కంచర్ల నారాయణరెడ్డి, వీరమళ్ల శ్రీనివాస్, దివంగత ధర్మారెడ్డి కుమారుడు సాయిరాంరెడ్డి, సూదిరెడ్డి లక్ష్మారెడ్డి, జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం నల్లగొండలో నిర్వహించిన పీఆర్టీయూటీఎస్ నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, 817 ఉద్యోగుల పరస్పర బదీలులు, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లడం జరిగిందన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాల సాధనకై సీఎంతోను, మంత్రులతోను చర్చిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పీఆర్టీయూ పక్షనా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరడంతో పాటు దానికై కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు సహితం వచ్చేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుల్లం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ పాల్గొన్నారు.