పెన్‌పహాడ్, ఫిబ్రవరి 29 : మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో గురువారం లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న జాతర కల్యాణంతో పరిపూర్ణమైంది. చివరిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే అమ్మవారికి సుప్రభాత సేవ, మహా విద్యా పారాయణం, చండీ సప్తసతి పారాయణం, వివిధ రకాల పూలు, పండ్లతో అర్చన చేశారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు నడుమ దేవతామూర్తుల కల్యాణ తంతు వైభవంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ కమిటీ చైర్మన్ మోదు గు నర్సిరెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజీవ్‌గాంధీ, పరెడ్డి సీతారాంరెడ్డి, జూలకంటి వెంకటరెడ్డి, జాల సైదు లు, ఎడ్ల వెంకటరెడ్డి, వరికల్లు శ్రీనివాస్, విలాసకవి వెంకటరాజు, వెన్న సైదిరెడ్డి, మడ్డి అంజిబాబు పాల్గొన్నారు.