రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
జిల్లా నుంచి డబ్లింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- అండర్ పాస్‌ల వద్ద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి
- ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
- నల్లగొండలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి పనులు ప్రారంభం
- వర్చువల్‌గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 26 : జిల్లా నుంచి డబ్లింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నల్లగొండ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించగా ఎంపీ బడుగులతోపాటు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రైల్వే డీజీఎం ప్రదీప్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పడిన నల్లగొండ రైల్వే స్టేషన్‌ను రూపురేఖలు అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మారనున్నాయన్నారు. జిల్లాలో రెండు రైల్వే స్టేషన్లను అమృత్ పథకం కింద ఎంపిక చేయడం సంతోషకరమని తెలిపారు. జిల్లా మీదుగా నడికుడి వరకు రైల్వే లైన్ డబ్లింగ్ కోసం తాము పార్లమెంట్లో పోరాటం చేశామని గుర్తు చేశారు. జిల్లాలో పెద్ద స్టేషన్లు అయిన నల్లగొండ, మిర్యాలగూడలో అన్ని రైళ్లను నిలుపుదల చేయాలని కోరారు.
వర్షాలు కురిసినప్పుడు రైల్వే అండర్ పాస్‌లలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వాటి చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం అమృత్ పథకం కింద ఇప్పుడు మంజూరైన నిధులు సరిపోవని,మరో రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ సూపరింటెండెంట్ దేవాసింగ్, స్టేషన్ మేనేజర్ సుధాకర్‌బాబు, కేంద్రీయ విద్యాలయ పిన్సిపాల్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్‌రెడ్డి, గోలి మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో..
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోనూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమృత్ పథకంలో మిర్యాలగూడ స్టేషన్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని వారన్నారు. ప్రతి రోజూ మిర్యాలగూడ నుంచి సుమారు 3వేల మంది రైలు ప్రయాణం చేస్తుంటారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాలని కోరారు. రైళ్లలో సీనియర్ సిటిజన్స్‌కు 30శాతం డిస్కౌంట్ ఇంకా అమలు కావడం లేదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

