నీళ్లు లేక ఎండుతున్న పంటలు
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో సుమారు 100 ఎకరాల వరి పంట ఎండిపోతున్నది.
- పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు
చౌటుప్పల్ రూరల్, మార్చి 10 : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో సుమారు 100 ఎకరాల వరి పంట ఎండిపోతున్నది. గత కొద్ది రోజులుగా గ్రామాల్లో ఏ రైతును కదిపినా బోరు బావుల్లో నీరు అడుగంటిందని, పొట్టదశకు వచ్చిన పంట చేతికి అందకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక పొట్టదశలో ఉన్న వరిపొలంలో గొర్లు, బర్రెలను మేపుతున్నారు.
పొట్ట దశలో వరి ఎండింది..
నాకు ఎనిమిది ఎకరాలు ఉండగా గతంలో లాగే ఈ సంవత్సరం కూడా మొత్తం సాగు చేసిన. ఇప్పుడు వరి చేను పొట్టదశలో ఉన్నది. నీరు లేక ఎండిపోతున్నది. కిలోమీటరు దూరంలో ఉన్న బావిలో నుంచి పైపులైను వేసిన. దాని ద్వారా కొద్దిగా నైనా పంటను కాపాడుకుందామని ప్రయత్నిస్తున్నా. అది ఎంతవరకు ఫలిస్తుందో తెల్వదు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలి. లేదంటే మళ్లీ వ్యవసాయం దండగా అన్నరోజులు చూస్తాం.
– పగిళ్ల అంజిరెడ్డి, రైతు, మందళ్ల గూడెం, చౌటుప్పల మండలం
కుంట నుంచి పైపులేసినా
నేను ఎనిమిఇ ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. బోరు బావుల్లో నీళ్లు లేక నాలుగు ఎకరాలు ఎండింది. చేసేదేమీ లేక గొర్రెలను మేపుతున్నా. చేతికి వచ్చిన పంట కొద్దిగా అయినా ఉంటదేమో అనుకుంటున్నా. గతంలో మార్చి రాకముందే బోరులు ఎండిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోయినాయి. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి కిలోమీటరు దూరంలో ఉన్న ఎన్జీఆర్ఐ దగ్గర ఉన్న కుంట నుంచి నీటిని పైపుల ద్వారా పారిస్తున్నా. గత ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సాయం చేసింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నష్టపోయిన రైతులను అదుకోవాలి.
– వళ్లూరి బీరప్ప రైతు, తూర్పుగూడెం, చౌటుప్పల మండలం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

