మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
మున్నూరు కాపుల జనాభా లెక్కల్లో కోత విధించడంపై తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవయ్య పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సైదయ్య పటేల్...
నల్లగొండ రూరల్, అక్టోబర్ 28 : మున్నూరు కాపుల జనాభా లెక్కల్లో కోత విధించడంపై తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవయ్య పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సైదయ్య పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి సభ్యత్వ నమోదు క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 45 లక్షలుగా ఉన్న మున్నూరు కాపుల జనాభాను 28 లక్షలకు తగ్గించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ జనాభా ప్రాతినిధ్యాన్ని తగ్గించిందని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని నమ్మి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని, అయితే మున్నూరు కాపులకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను కుల సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
సభ్యత్వ నమోదుతో బలం చాటాలి
రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. www.munnurukapusangam.org వెబ్సైట్, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి మున్నూరు కాపు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా తమ జనాభా బలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయవచ్చన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 నుండి 5 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 2 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సంకురి వెంకటనారాయణ, రాళ్లపల్లి ప్రసన్నకుమార్ వాసంశెట్టి సైదులు గాజుల శ్రీనివాస్ కుప్పగిరి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంకూరి అనంత రాములు, తొట్ల నాగేశ్వరరావు, దాసరియాల లింగయ్య నాయుడు, సాలాదిగిరి గోపిశెట్టి, అమరయ్య, వాసంశెట్టి సైదులు, అంబటి సైదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

