కోదాడ, ఏప్రిల్ 30 : కమ్యూనిస్టు నాయకుడు, కోదాడ పట్టణానికి చెందిన పిల్లుట్ల పిచ్చయ్య (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సీపీఐలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన రాత్రిపూట బడులు నిర్వహించి అక్షరాస్యత పెంపునకు దోహదపడ్డారు. దీంతో పాటు పలు సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన కుమారుడు, బలహీన వర్గాల నేత పిల్లుట్ల శ్రీనివాస్ దహన సంస్కారాలు నిర్వహించారు.
పిచ్చయ్య మృతి పట్ల సీపీఐ సీనియర్ నాయకులు గన్నా చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, ఎర్నేని వెంకటరత్నం బాబు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఒంటిపులి వెంకటేశ్, ఎస్కే నయీమ్, డేగ శ్రీధర్, శ్రీకాంత్ యాదవ్, పాలడుగు సంజయ్, నెమ్మాది సురేశ్, నాగరాజు, కుల సంఘాల నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.