నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తన అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడడానికి, ఆయన ప్రసంగం వినడానికి దండుగా కదిలివచ్చారు. దాంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. జెండాలు, ఫ్లెక్సీలతో నకిరేకల్ పట్టణం, సభ పరిసరాలు గులాబీమయమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు. మధుప్రియ కళాబృందం ఆటాపాట ఉర్రూతలూగించాయి.