రామగిరి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పీఆర్సీ అమలు అలాగే పెండింగ్ బిల్లుల సత్వర చెల్లింపులకై తపస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన 24 గంటల ధర్నాకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తిని భాస్కర్ గౌడ్, రేణికుంట్ల రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు సత్వరం మంజూరు చేయాలన్నారు. పీఆర్సీ అమలు చేయాలని డిమాండు చేశారు. ఈ దీక్షకు జిల్లాలో ఉన్న పెన్షనర్లు పూర్తి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఇరుగు శ్రీరాములు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, పొనుగోటి రవీందర్ రావు, కొమిరెల్లి భాస్కర్ రెడ్డి, కంచనపల్లి విజయకుమర్, అలుగుపల్లి పాపిరెడ్డి పాల్గొన్నారు.