పట్టించుకునేవారు లేక గురుకులాల్లో చావు కేక
జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.
- వరుస మరణాలతో భయాందోళనలు
- ఆరు నెలల్లో నలుగురు విద్యార్థుల మరణం..
- తాజాగా దోసపహాడ్‌లో విద్యార్థిని
- సర్కారు నిర్లక్ష్యం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడమే కారణం?
- వసతిగృహాల్లో కేర్ టేకర్లు అవసరం
సూర్యాపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ) : జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు. వాస్తవానికి రాత్రి భోజనం చేసే సమయంలో అన్నం మెతుకులు గొంతులో ఇరుక్కున్న కారణంగా చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. అదే సమయంలో ఎవరైనా పట్టించుకుని నోరు కడిగించి, అందుకు సంబంధించిన ఒక టాబ్లెట్ వేసి ఉంటే బాబు బతికేవాడని వైద్యులు చెప్తున్నారు.
ఈ నెల 16న.. పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి చనిపోయింది. సోమవారం రాత్రి 102 డిగ్రీల జ్వరంతో బాలిక ఇబ్బంది పడుతుంటే ఒక మందు గోలి వేసి తగ్గుతుందిలే అని వదిలేయడంతో పిట్స్‌కు దారితీసింది. తెల్లవారే సరికి పరిస్థితి విషమించడంతో అప్పుడు పరుగుపరుగున ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలి తం లేకపోయింది. సరస్వతి చనిపోయింది.
ఇటీవల బాలెంల గురుకుల మహిళా డిగ్రీ కళాశాల్లో సమస్యలు పరిష్కరించాలని, తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు వారంపాటు ఆందోళనకు దిగడం తెలిసిందే. ఈ వరుస ఘటనలన్నీ గురుకులాలపై సర్కారు నిర్లక్ష్యాన్ని, అధికారుల పర్యవేక్షణలోపాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. చదువు కోసం సర్కారు బడికి వచ్చిన పేదింట బిడ్డలను బలపీఠం ఎక్కిస్తున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిస్తున్నాయి. మరోవైపు ఇలాంటి ఘటనలతో మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురవుతుండడం బాధాకరం.
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఎప్పుడు ఏ పాఠశాలలో ఎలాంటి సంఘటన జరుగుతుందోననే భయానక పరిస్థితి నెలకొంది. గురుకుల విద్యా సంస్థల్లో ఆరు నెలల కాలంలో నలుగురు చనిపోవడమే తీవ్రతను చెప్తున్నది. ఇటీవల బాలెం సోషల్ వెల్ఫేర్ బాలికల డిగ్రీ కళాశాలలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమే విమర్శలు వెల్లువెత్తున్నాయి. హాస్టళ్లలో విద్యార్థులను కనీసం పట్టించుకోవడం లేదని, సుస్తీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. వందలాది విద్యార్థులు ఉండే హాస్టళ్లు, గురుకులాల్లో రాత్రి విధుల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటుండగా. కేర్ టేకర్లు ఎక్కడా లేకపోవడం గమనార్హం. పిల్లలను ప్రైవేట్‌లో చదివించే స్థోమత లేక సర్కారు విద్యా సంస్థల్లో పరీక్ష రాయించి మరీ చేర్పిస్తుంటే తమ బిడ్డలను శవాలుగా అప్పగిస్తున్నారని బాధిత తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి దగ్గరే ఆ శాఖ ఉన్నా అధికారులపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
కలిచి వేస్తున్న విద్యార్థుల మరణాలు..
జిల్లాలోని గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో జరుగుతున్న ఘటనలు అందరినీ కలచి వేస్తున్నాయి. ఐదు నెలల క్రితం సూర్యాపేట మండలం ఇమాంపేటలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోగా, మిగిలిన విద్యార్థినులు హాస్టల్లో ఉండేందు చాలా భయపడ్డారు. దాంతో వారంపాటు సెలవులు ప్రకటించిన అధికారులు.. అనంతరం జిల్లాలో అక్కడకక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇది కొద్దిరోజులు మాత్రమే కొనసాగగా, ఆ తర్వాత వదిలేశారు. ఆ తర్వాత గత నెలలో ఆత్మకూర్.ఎస్‌లో ఏడో తరగతి విద్యార్థి చనిపోవడం తెలిసిందే. తాజాగా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గురుకులంలో మరో విద్యార్థిని మరణం. ఇదే క్రమంలో ఇటీవల బాలెంల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు వారంపాటు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. హాస్టల్లో సమస్యలు పేరుకుపోయాయని, మెనూ సరిగ్గా పాటించడం లేదని, సమస్యలపై ప్రశ్నిస్తే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని నిరసనలకు దిగారు. విద్యార్థినుల పోరాటం అధికారులు ప్రిన్సిపాల్‌ను అక్కడిని నుంచి బదిలీ చేశారు. ఇలాంటి ఘటనలు జరిపినప్పుడు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగితే తప్ప ప్రభుత్వం, అధికారుల నుంచి పట్టింపు ఉండడం లేదు. ఇప్పటికైనా స్పందించి ఈ మరణాలను ఆపే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులను పర్యవేక్షించేందుకు కేర్ టేకర్‌ను నియమించడం ద్వారా ఈ సమస్యలకు కొంతమేర పరిష్కారం దొరుకుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

