Nalgonda : ‘బీహార్‌లో అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ’
బీహార్ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద ఓట్ల తొలగింపును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రామగిరి, ఆగస్టు 08 : బీహార్ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద ఓట్ల తొలగింపును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్లు తొలగిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. ఓట్ల తొలగింపులో అత్యధికంగా మైనారిటీలు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లే ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 40 నుండి 60 శాతం ఓట్లను తీసేసిందన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం అండదండలతో బీజేపీ బీహార్‌లో అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నదని దుయ్యబట్టారు.
బీహార్ లో ఎన్నికల వేళ 65 లక్షల ఓట్లను తొలగించారని, త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఓట్ల తొలగింపు పక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తమకు ఓటు వేయని ముస్లింలు, క్రిస్టియన్లను పౌరసత్వం పేరుతో వారి ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పౌరసత్వానికి ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలు అర్హత కాదని, తాత ముత్తాతల జనన ధ్రువీకరణ పత్రాల ద్వారానే నిరూపించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాశం, మహ్మద్ సలీం, గంజి మురళీధర్, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, మల్ల మహేశ్, నల్పరాజు సైదులు, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, కుంభం కృష్ణారెడ్డి, ఔట రవీందర్, బొల్లు రవీందర్, కొండ వెంకన్న, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Bihar
- BJP
- CPM
- Nalgonda News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

