పూల పండుగొచ్చె..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలు ఆటపాటలతో సంబురంగా చేసుకునే వేడుక. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు వేడుకలు కనుల పండువగా సాగనున్నాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మార్మోగనున్నాయి.
- నేడు ఎంగిలిపూల బతుకమ్మ
- తొమ్మిది రోజులు ఊరూవాడ సంబురాలు
- ముందస్తుగా పలు విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
రామగిరి/దేవరకొండ/మిర్యాలగూడ/నందికొండ/చిట్యాల, అక్టోబర్ 13 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలు ఆటపాటలతో సంబురంగా చేసుకునే వేడుక. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు వేడుకలు కనుల పండువగా సాగనున్నాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మార్మోగనున్నాయి. శనివారం ఎంగిలిపూల బతుకమ్మకు మహిళలు సిద్ధమయ్యారు. మార్కెట్లలో పూల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ సారి అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం లేదు. శుక్రవారం పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆటపాటలతో విద్యార్థినులు ఉత్సాహంగా గడిపారు.
రామగిరి, అక్టోబర్ 13 : తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతి, సంప్రదాయాల వేడుక పూల పండుగకు జిల్లా అంతా సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు మహిళలు ఉత్సాహంగా జరుపుకొనే వేడుకలు శనివారం ఎంగిలి పువ్వు బతుకమ్మతో ప్రారంభమై ఈ నెల 22న జరిగే సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి నవ వైవిధ్యాలు, నైవేద్యాలను జగన్మాతకు సమర్పించి పూజలు చేయనున్నారు. కాగా. ఎంజీయూ పరిధిలోని కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం విద్యార్థులు ఆయా కళాశాలల్లో బతుకమ్మ ఆడిపాడారు.
9 రోజుల ఉత్సవాలు ఇలా..
పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ 9 రోజులు 9 రకాలుగా బతుకమ్మలను పేర్చి నవ నైవేద్యాలను సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్ద పప్పు, నాలుగో రోజు బియ్యం, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకొన్నారు.
బతుకమ్మ పూలకు భలే గిరాకీ
బతుకమ్మ ప్రారంభమవుతుండంతో పూలకు గిరాకీ పెరిగింది. ప్రధాన పట్టణాల్లోని కూడళ్లు, పూల సెంటర్లు మహిళలతో కిక్కిరిశాయి. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్, రామగిరి, ప్రకాశం బజార్, దేవరకొండ రోడ్డు, హైదరాబాద్ రోడ్డులో తీరొక్క పూలు విక్రయానికి ఉంచారు. బంతి పూల గిరాకీ బాగా సాగింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

