నీలగిరి, అక్టోబర్ 08 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం గర్భిణికి కడుపుకోతను మిగిల్చింది. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన కడమంచి మహేశ్ భార్య రేణుక నిండు గర్భిణి. వైద్య పరీక్షల నిమిత్తం ఈ రోజు ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో బేబీ బాగుంది, వారం తర్వాత మళ్లీ రమ్మని చెప్పి పంపారు. వాళ్లు బయటకి వచ్చి టిఫిన్ తినగానే గర్భిణికి నొప్పులు రావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్లు పరీక్షించి రెండు రోజుల క్రితమే కడుపులోని బేబి చనిపోయిందని తెలిపారు. అలాగే పాపను బయటకు తీయకుంటే తల్లి ప్రాణానికి సైతం హాని అని ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ, డిప్యూటీ సూపరింటెండెంట్ నగేశ్‌కు నమస్తే తెలంగాణ కాల్ చేయగా వారు స్పందించలేదు.