బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Dec 20, 2020 , 00:48:24

నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి

నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి

  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

కనగల్‌ : హరితహారం అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని తేలకంటిగూడెం, ఇస్లాంనగర్‌లో అవెన్యూ ఫ్లాంటేషన్‌, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డులు, తిమ్మన్నగూడెం, శేరిలింగోటం, బాబాసాహెబ్‌గూడెం గ్రామాల్లో సాగర్‌రోడ్డు ప్రధాన రహదారికి వెంట నాటిన మొక్కలతోపాటు మంకీ ఫుడ్‌కోర్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. రోడ్లకు ఇరువైపులా నాటిన చిన్నచిన్న మొక్కలకు ఎరువులు వేసి, పాదులు తీసి, గడ్డిని తొలగించాలన్నారు. వంగిన మొక్కలను సరిచేయాలని సూచించారు. ట్రీగార్డులు లేనివాటికి వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీపీ కరీంపాషా, ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, ఏపీఓ సుధాకర్‌, ఎంపీఓ ముజావుద్దీన్‌, డీటీ తబిత, ఆర్‌ఐ అరుణ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

VIDEOS

logo