శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 21, 2020 , 01:20:36

అభివృద్ధి జెండాను ఆశీర్వదించండి

 అభివృద్ధి జెండాను ఆశీర్వదించండి


చిట్యాల : ఎప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతాడో తెలియక , ఏ పార్టీలో ఉన్నాడో టక్కున చెప్పలేని స్థితిలో ఉన్న కోమటిరెడ్డికి మతిభ్రమించిందని, ఉత్త కోతలు కోసే ఉత్తమ్‌ కూడా మతిభ్రమించిన వారిలో చేరాడని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించాడు. కాంగ్రెస్‌ పార్టీ ఎండిపోయిన చెట్టు లాంటిదని.. దానికి ఓటు వేస్తే మోరిలో వేసినట్లేనని.. ఓటు విలువ తెలుసుకొని అభివృద్ధి కోసం పనిచేసే టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోరోతూ సోమవారం  చిట్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మం ది కార్యకర్తలతో సర్వీసు రోడ్డు వెంట జరిగిన ర్యాలీ అనంతరం శ్రీ కనకదుర్గా సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఓటు ఎంతో విలువైందని 2014 ఆ ఓటు విలువ తెలుసుకొని కేసీఆర్‌కు ఓటు వేయటంతో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినదో మీకే కనిపిస్తుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మున్సిపాలిటీలకు రూ.100కోట్లు తీసుకువస్తామని హామీలు ఇస్తుండ్రు  ఆ నిధులు ఎక్కడ నుంచి తెస్తాడో.. చెప్పాడో అని మంత్రి ప్రశ్నించాడు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక సర్పంచులకు గౌరవం పెరిగిందని అలాగే మున్సిపల్‌ చైర్మన్ల గౌరవాన్ని కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అవసరమైతే ఢిల్లీకి వళ్లైనా చిట్యాలలో జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ తరుపున కారు గుర్తుపై పోటీ చేసి, టీఆర్‌ఎస్‌ జెండా ఉన్నవారే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులని... అందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ చిట్యాలలోని అన్ని వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే వారిని మంత్రి జగదీశ్‌రెడ్డికి కానుకగా ఇచ్చి ఆయన సహకారంతో సీఎంను ఒప్పించి అధిక నిధులు తీసుకువస్తానన్నారు. కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య, నాయకు లు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, పాటి నర్సిరెడ్డి, కర్నాటి ఉప్పల వెంకట్‌రెడ్డి, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, గుండెబోయిన సైదులు, బెల్లి సత్తయ్య, మెండె సైదులు, ఎద్దులపురి క్రిష్ణ, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు, వివిధ గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు  పాల్గొన్నారు.
logo