మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 16, 2020 , 05:45:01

నెలాఖరు వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి

నెలాఖరు వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి

  • ప్రకృతి వనాల ఏర్పాటులో నిర్లక్ష్యం సహించం
  • అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్‌ శర్మన్‌ 
  • పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నెలాఖరు వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌చౌహాన్‌ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు మనుచౌదరి, హనుమంత్‌రెడ్డిలతో కలిసి నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ డివిజన్ల వారీగా ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తాసిల్దార్లతో గ్రామాల్లోని అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 461 గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డ్‌లు, శ్మశాన వాటికలు, 143 రైతు వేదిక భవన నిర్మాణాల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలకు వెంటనే స్థలాలను కేటాయించాలని ఆదేశించారు. రైతు వేదికలు, ప్రకృతి వనాలను అధికారులు ప్రతిరోజు పరిశీలించాలన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతగా నెలాఖరు వరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తికాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనుల పురోగతి సాధించని మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్‌, గ్రామీణాభివృద్ధి అధికారి సుధాకర్‌, ఆర్డీవోలు, డీఎల్‌పీవోలు, మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. logo