Viral Video | ఈ దోశను ట్రై చేస్తారా..! : బిస్లరీ పానీ వాలా దోశ
Viral Video : టేస్టీ ఫ్లేవర్, స్పైసీ ఫుడ్ అంటే సౌతిండియన్ రెసిపీలే ముందుగా గుర్తుకొస్తాయి. క్రిస్పీ దోశల నుంచి మెత్తటి ఇడ్లీలు, హాట్ వడల వరకూ దక్షిణాది స్నాక్స్ అంటే అందరూ ఇష్టంగా ఆరగిస్తారు.
Viral Video : టేస్టీ ఫ్లేవర్, స్పైసీ ఫుడ్ అంటే సౌతిండియన్ రెసిపీలే ముందుగా గుర్తుకొస్తాయి. క్రిస్పీ దోశల నుంచి మెత్తటి ఇడ్లీలు, హాట్ వడల వరకూ దక్షిణాది స్నాక్స్ అంటే అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఇక ఇంటర్నెట్లో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్ వీడియోలు వైరల్ అవుతుండగా తాజాగా సౌతిండియన్ క్లాసిక్ దోశపై ఈసారి దాడి జరిగింది.
ఓ ఫుడ్ వ్లాగర్ తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో టేస్టీ దోశను ప్రయోగం పేరుతో చెడగొట్టిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ దోశకు వ్లాగర్ బిస్లరీ పానీ వాలా దోశ అనే పేరు పెట్టారు. ఇక ఈ క్లిప్‌లో వీధి వ్యాపారి పెనంపై దోశ పిండి ఆపై క్యారట్, ఆనియన్ సహా పలు పదార్ధాలు వేయడం కనిపిస్తుంది. ఇక దోశెపై ప్యాకేజ్డ్ వాటర్‌ను పోసి మిశ్రమాన్ని కలపడం చూడొచ్చు.
దోశపై అన్ని ఫ్లేవర్లూ యాడ్ చేసిన తర్వాత నీళ్లు ఎందుకు పోస్తున్నారో అర్ధం కాక తలపట్టుకోవడం యూజర్ల వంతైంది. డియర్ నార్త్ ఇండియన్స్ దయచేసి మా ఆహార పదార్ధాలను నాశనం చేయకండని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇక మరో యూజర్ దోశకు న్యాయం చేయండని వేడుకోగా, ఆరోగ్యకరమైన దోశను అనారోగ్యకర డిష్‌గా తయారుచేశారని మరో యూజర్ మండిపడ్డారు. నీటిలో ఏదో దోశ అని మరొక యూజర్ పెదవివిరిచారు.
Read More :
Surgery | వచ్చీరాని వైద్యం చేసి.. ఓ నిండు ప్రాణం తీసి..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

