గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:12:27

పల్లె ప్రగతిని కొనసాగించాలి

పల్లె ప్రగతిని కొనసాగించాలి పల్లె ప్రగతి పరిశీలకులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఐజీ

కోడేరు: గ్రామాల అభివృద్ధ్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాలలో నిరంతరం  పల్లె ప్రగతి రాష్ట్ర పరిశీలకులు పోలీస్  హౌసింగ్ కార్పొరేషన్ ఐజీ మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కోడేరు పసుపుల గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ  ఆయన మాట్లాడుతూ మండల  కోడేరులో ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నాయని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని విస్తరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రోడ్లు శుభ్రంగా ఉండాలని ఇంకా మురుగుకాలువలను అన్ని కాలనీలకు విస్తరంపచేయాలని ఈవోపీఆర్డీ భద్రునాయక్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాలలో వారంలో ఒక రోజు  శ్రమధాన కార్యక్రమాలు చేయాలని నిరంతరం శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమాలను చేస్తుండాలని ఈ  గ్రామాలలోని అన్ని వర్గాల ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలు అధికారులు సమన్వయంతో గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి పనుల  ప్రభుత్వం కావాల్సిన నిధులను కేటాయించినట్లు ఆయన వివరించారు. అంతకు  స్థానిక గ్రామ  కార్యాలయంలో పల్లె ప్రగతి రికార్డులను పరిశీలించారు. అనంతరం  ప్రభుత్వ పాఠశాల బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట స్థానిక  సర్పంచ్ వెంకటస్వామి, ఈవోపీఆర్డీ భద్రునాయక్, వార్డు సభ్యులు సురేశ్‌శెట్టి, ఏఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.


logo