శుక్రవారం 15 జనవరి 2021
Mulugu - Nov 30, 2020 , 03:18:25

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

ములుగు, నవంబర్‌29: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆదివారం సంకల్ప దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు సీపీఎం జిల్ల కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, ఎమ్మార్పీస్‌ రాష్ట్ర నాయకుడు జన్ను రవి, మాజీ సర్పంచ్‌ గుగ్గిళ్ల సాగర్‌ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్‌, తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వినుకొండ విశ్వంకుమార్‌, ఎండీ. చాంద్‌పాషా, ఎనగందుల శంకర్‌, ముప్పు పూర్ణచందర్‌, గొట్టి ముక్కల రాజేశ్‌కుమార్‌, మనోహర్‌, రమేశ్‌, వెంకటేశ్‌, మహేశ్‌, సృజన్‌, రాము, విజయ్‌, రవీందర్‌, సంజీవ, ప్రణిత తదితరులు పాల్గొన్నారు.