బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Mar 04, 2020 , 02:33:48

మాయమవుతున్న మానవత్వం

మాయమవుతున్న మానవత్వం
  • పడగవిప్పిన రాక్షసత్వం
  • బాకీ చెల్లించకుండా మట్టు పెట్టేందుకు ప్రణాళికలు
  • నమ్మించి, రప్పించి విడదీసి దాడి
  • ఆసరా కోసం వెళ్లి అసువులు బాసిన వైనం
  • అమాయకుడి ప్రాణం తీసిన వ్యాపార లావాదేవీలు
  • కర్కశంగా నరికి చంపిన కిరాతకుడు
  • ఒకటి, రెండు రోజుల్లో పారిపోయేందుకు ప్రణాళికలు
  • గతంలోనూ హత్య నేరం ఆరోపణలు
  • పెరిగిపోతున్న రౌడీయిజం, రాక్షసత్వం
  • ప్రమాదపుటంచున మానవ సంబంధాలు

ములుగుజిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ : సమాజంలో పరస్పర సహకారం, ఒకరికొకరు చేయూతను ఇచ్చే పరిస్థితుల నుంచి ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా మానవ సంబంధాలను దెబ్బతీసే దశకు చేరుకున్నాయనే సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సమాజంలో ప్రతిఒక్కరు తమకు వచ్చిన ఆపదను, సంతోషాలను ఉమ్మడిగా పంచుకుని, సమస్యలు పరిష్కరించుకుని కష్ట సమయాల్లో మిత్రులకు, బంధువులకు సహాయ సహకారాలు అందించి వారిని ఆపద నుంచి రక్షించాలనే నానుడి గత కాలం నుంచి సమాజంలో బలీయమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. ఒకరి ఆపద వచ్చిన సమయంలో మరొకరు ఆదుకోవడం, అండగా నిలవడం సాధారణంగా చోటు చేసుకునే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు నేడు పూర్తిగా మృగ్యమై మానవుల్లో రాక్షసత్వం, రౌడీయిజం పెరిగిపోయి మనుషులను హత మార్చి పైశాచిక ఆనందాలు పొందే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. సమాజంలో ఆర్థిక, మానవ సంబంధాలు నాటి నుంచి నేటి వరకు బలీయంగా కొనసాగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒకరికి అవసరం ఉన్న సమయంలో మరొకరు ఆదుకోవడం వంటి ఘటనలు నిత్యం ఎన్నో చూస్తూ ఉన్న నేటి రోజుల్లో ఆర్థిక లావాదేవీలు, ప్రాణాలు సైతం హరిస్తాయని సోమవారం గోవిందరావుపేట మండలం పస్రాలో చోటు చేసుకున్న సంఘటన నిదర్శనంగా నిలుస్తున్నది. 


నూతన వ్యాపారం కోసం అప్పు పొంది..

గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ఆరు సంవత్సరాల క్రితం ప్రభు, దయా అనే ఇద్దరు అన్నదమ్ములు బెంగుళూరు బేకరీని వరంగల్‌- ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద వారి అవసరాల మేరకు వ్యాపార లావాదేవీల కోసం డబ్బులను అప్పుగా తీసుకోవడం, చెల్లించడం జరుగుతుందని సమాచారం. ఆరు నెలల క్రితం ప్రభు అనే వ్యక్తి దేవేందర్‌రెడ్డి వద్ద పస్రా, మేడారం, రహదారిలో అటవీ శాఖ వ్యాపార సముదాయంలో  తన నూతన బేకరీ ఏర్పాటు కోసం రూ.ఆరు లక్షలను అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బేకరి ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ప్రభు సకాలంలో అప్పు చెల్లించడంతో విఫలం చెంది పలు పర్యాయాలు ఇరువురి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్న అనంతరం పోలీసులను ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం తీసుకున్న అప్పును చెల్లించాలని బలంగా నిలదీయడంతో నిం దితుడు అప్పు ఇచ్చిన వ్యాపారిపై దాడికి దిగినట్లు తెలుస్తున్నది. 


నమ్మించి, రప్పించి .. 

ప్రభు తీసుకున్న అప్పును చెల్లించేందుకు దేవేందర్‌రెడ్డిని వ్యక్తిని పస్రాకు అత్యంత నమ్మకంగా రప్పించి తనకు రావాల్సిన చిట్టి డబ్బుల అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాడు. వారిని పూర్తిగా చిట్టి డబ్బులు  ఇచ్చే వ్యక్తి వద్దకు వ్యక్తిగతంగా తీసుకెళ్లి మాట్లాడించి అనంతరం ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే దేవేందర్‌రెడ్డి, అతడికి సహాయంగా వచ్చిన మిత్రుడు వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి ఫొటో జర్నలిస్టు సునీల్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి రాక్షసంగా గొంతుకోసి హతమార్చిన సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. అప్పు తీసుకున్న వ్యక్తి చిట్టి వ్యాపారి వద్ద నుంచి వచ్చిన అనంతరం జరిగిన ఘర్షణ అనంతరం దేవేందర్‌రెడ్డిని ముందుగా జాతీయ రహదారి ఆనుకుని ఉన్న బెంగళూరి బేకరి వెనుక వైపునకు తీసుకెళ్లి కేకులు కోసే అత్యంత పదునైన కత్తితో దాడి చేసి గాయపర్చి ఏమి తెలియనట్లుగా తలుపులు వేసి బయటకు వచ్చిన సంఘటన స్థానికులను కలవరానికి గురి చేసింది. ముందస్తు పథకం ప్రకారం దేవేందర్‌రెడ్డిపై దాడి చేసిన హంతకుడు దయా ఈ విషయం తెలియని సునీల్‌రెడ్డిని తన ఇంటి వద్దకు తీసుకెళ్లి దేవేందర్‌రెడ్డిపై దాడి చేసిన కత్తితోనే విచక్షణ రహితంగా గొంతుకోసి హత్య చేసి వంట గదిలో తోసి వేసి నేరాన్ని మాయ చేయాలనే ముం దస్తు ప్రణాళికలో భాగంగానే ఏమి తెలియని సహాయంగా వచ్చి న అమాయకుడి ప్రాణాలు తీయడం ఒక్క సారిగా సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే సంఘటనగా చర్చించుకుంటున్నారు. 


 గతంలోను హత్య నేరారోపణలు..

బెంగళూరు బేకరీ నిర్వహించే దయా అనే వ్యక్తి గతంలోనూ తన వద్ద పనిచేసే వ్యక్తిని హత్య చేసి గుండ్లవాగు ప్రాజెక్టులో ఈ త రాక మునిగి మరణించాడనే కథనం స్పష్టించాడనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. నిత్యం వ్యాపార లావాదేవీల్లోనే నిమగ్నమయ్యే వక్తి తనలో ఇంతటి రాక్షసత్వం ఉందని స్థానికులు ఎవ రు పసిగట్టి ఉండకపోవచ్చనే చర్చ సాగుతున్నది. సోమవారం జరిగిన సునీల్‌రెడ్డి హత్య, దేవేందర్‌రెడ్డిపై హత్య యత్నం సం ఘటన నేపథ్యంలో గతంలో జరిగిన గుండ్లవాగు వ్యక్తి హత్య దయా పనే అయి ఉంటుందనే స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. వ్యాపారం చేసే వ్యక్తి ఇంతటి హత్యా నేర చరిత్ర ఉందని ఎవరికి అర్థం కాకుండానే వ్యాపారం ముసుగులో హత్యలు చేసే స్థాయికి దిగజారడంతో స్థానికంగా వ్యా పార లావాదేవీలకు పెను ప్రమాదం పొంచి ఉందనే ప్రమాదాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేర సంఘటనల నేపథ్యం లో వ్యాపార రంగమే కుదేలయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశాలు మెండుగా ఉంటాయని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 


పారిపోయే ప్రణాళికలు.. 

ఆరు సంవత్సరాలుగా స్థానికంగా వ్యాపారం చేస్తూ బెంగుళూరి బేకరీ సోదరులు దేవేందర్‌రెడ్డితో పాటు మరికొంత మంది వద్ద ఆర్థిక లావాదేవీలను పెద్ద మొత్తంలో జరిపినట్లుగా సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో స్థానికంగా వ్యాపారాలను ముగించేసి ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో పారిపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న దేవేందర్‌రెడ్డి దయాపై బాకీ చెల్లించే విషయంలో తనకు ఉన్న మార్గాలన్నింటిని ప్రయోగించి ఎలాగైన  బాకీ డబ్బులు రాబట్టాలనే ప్రయత్నాల్లో భాగంగా సోమవారం తనకు ఉన్న పరిచయాలన్నింటి ఉపయోగించి దయాపై పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచాడు. దీంతో అతడు దయలేని నరరూప రాక్షసుడిగా మారిన దయా బాకీ ఇచ్చి వ్యాపారాన్ని నిలబెట్టిన వ్యక్తిని అతనికి సహాయంగా వచ్చిన అమాయకుడిని బలిచేసే కార్యక్రమానికి పూనుకోవడం సభ్యసమాజం వేలెత్తి చూపే పరిస్థితులు నెలకొన్నాయి. దేవేందర్‌రెడ్డి తన బాకీపై పట్టు భిగించి ఉండకపోతే రెండు రోజుల్లో దయ తన వ్యాపార లావాదేవీలను మూసివేసి ఇక్కడి నుంచి పారిపోయే ప్రణాళికను అడ్డుతగిలారనే అక్కసుతోనే సునీల్‌రెడ్డి అనే అమాయకుడితో పాటు   దేవేందర్‌రెడ్డిపై దాడికి పాల్పడినట్లుగా  చర్చ సాగుతున్నది. 


పెరిగిపోతున్న రౌడీయిజం, రాక్షసత్వం..

సమాజంలో నమ్మకంతో అనేక పనులు విజయవంతంగా నిర్వహించే అవకాశాలు ప్రస్తుత సమాజంలో గండి పడుతున్నాయనే అపవాదులు చోటుచేసుకుంటున్నాయి. అవసరాల నిమిత్తం అప్పులు తీసుకుని బాకీ అడిగిన వ్యక్తులు, వారికి ఆసరాగా వెళ్లిన అమాయకులపై దాడులు చేస్తూ రౌడీయిజం, రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏ వ్యక్తికైనా అవసరాలు, ఆపదలు చెప్పి రావని అలాంటి సమయాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడే సంఘటనలు సమాజానికి మంచివి కావని, మేలు చేసే వారికి కీడు చేయడం సమాజంలో ఏ వ్యక్తి సహించని అంశం. ప్రస్తుతం సమాజమంతా రౌడీయిజం, రాక్షసత్వంతో పేరుకుపోయి మంచి మానవత్వం మంట గలిశాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం వల్ల మానవ, ఆర్థిక సంబందాలు, వ్యాపారల లావాదేవీలకు పెను ముప్పు కలిగే అవకాశాలు లేకపోదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


logo