శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jan 29, 2020 , 03:16:30

మేడారం జాతరలో11 ఫైరింజన్లు

మేడారం జాతరలో11 ఫైరింజన్లు

మట్టెవాడ, జనవరి 28 : ఆసియాలోనే అతిపెద్దదైన మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలో అగ్నిమాపక శాఖ ప్రత్యేక సేవలందించనుంది. 11 ఫైరింజన్‌లను ఏర్పాటు చేయడంతోపాటు 220 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్‌ డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎం భగవాన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ములుగు ఫైర్‌ స్టేషన్‌కు సంబంధించిన ఫైర్‌ ఇంజన్‌ ఈ నెల 3వ తేదీ నుంచి సిబ్బంది సేవలను అందిస్తున్నారని వివరించారు. వారం రోజుల్లో మేడారం జాతర ప్రారంభమతున్న నేపథ్యంలో 9 మిస్ట్‌ బుల్లెట్స్‌ ఫైరింగ్‌విషర్‌లతో అందుబాటులో ఉంచామన్నారు. రద్దీ ఉండే ప్రాంతాల నుంచి త్వరగా వెళ్లేలా వీటిని ఉపయోగించునున్నట్లు ఆయన వివరించారు. చిలకలగుట్ట, వనదేవతల గద్దెల ప్రాంతం, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, హెలిప్యాడ్‌, వీవీఐపీ వెహికిల్స్‌ వద్ద, నార్లాపూర్‌, చింతల్‌ క్రాస్‌, తాడ్వాయి వద్ద తమ ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయని భగవాన్‌రెడ్డి తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునే క్రమంలో వైర్‌లెస్‌ సెట్లను వాడుతున్నట్లు తెలిపారు. ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన భక్తులకు సూచించారు. ఎప్పటికప్పుడు తాము ఎంతో అప్రమత్తతతో మెలుగుతామని, అందరూ సహకరించాలని భగవాన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు


logo