ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:21:41

ములుగులో సంత..

ములుగులో సంత..
  • -జిల్లా కేంద్రంలో నేడు ప్రారంభం
  • -ముస్తాబైన అంగడి మైదానం
  • -ప్రతి ఆదివారం నిర్వహణ
  • -30 గ్రామాల ప్రజలకు అందుబాటులో ..
  • -ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు


ములుగు, నమస్తేతెలంగాణ: ములుగు జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతను ఏర్పాటు చేస్తోంది. దీనిని ఆదివారం జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌, జెడ్పీటీసీ సకినాల భవాని  ప్రారంభించనున్నారు.  కాగా, మాజీ మంత్రి చందూలాల్‌ అంగడి  మైదానంలో  సంత ఏర్పాటుకు రూ.77లక్షల నిధులు మంజూరీ చేశారు.  ఈ పనులు ప్రస్తుతం పూర్తి దశకు చేరుకున్నాయి.  ఈ సంతలో  కూరగాయాలు, మటన్‌, చికెన్‌,  చేపలు, ఇతర నిత్యవసరాలు లభించనున్నాయి. గతంలో ములుగు నియోజకవర్గంగా ఉన్న సమయంలో కొనసాగిన సంత అనివార్య కారణాలతో ఆగిపోయింది. మళ్లీ జిల్లాగా ఏర్పాటైన తర్వాత ప్రస్తుతం తిరిగి వెలుగులోకి వస్తోంది.  ఈ సంత ఏర్పాటుతో ములుగులో వ్యాపారం మరింత పెరుగనుంది. 

30 గ్రామాల ప్రజలకు అందుబాటులో..

 జిల్లా కేంద్రంతో పాటు ములుగు, వెంకటాపూర్‌, మండలాల్లోని 30 గ్రామాల ప్రజలకు ఈ సంత అందుబాటులోకి రానున్నది. జిల్లా కేంద్రం పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ప్రతి బుధవారం, మల్లంపల్లిలో ప్రతి గురువారం, పస్రాలో ప్రతి మంగళవారం సంతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని అంగడి మైదానంలో ప్రారంభంకానున్న సంతను ప్రతి ఆదివారం నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సంతలో కూరగాయాల నుంచి మొదలు..  గొర్రెలు, మేకల, గేదెలు, పశువుల వ్యాపారంతో పాటు ప్రజలకు అవసరయ్యే  నిత్యావసర సరుకులు  లభించనున్నాయి. 
ఇప్పటికే తరలిన చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలు..


logo