ఆహ్లాదానికి చిరునామా..

- నివాస యోగ్యంగా గుండ్లపోచంపల్లి
- పెద్ద ఎత్తున వెలిసిన విల్లాలు, అపార్ట్మెంట్లు..
- ప్రశాంత వాతావరణం, అనువైన రవాణా సౌకర్యం
- ఆసక్తి చూపుతున్న ఉన్నత శ్రేణివర్గం
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 3 : నగరానికి ముఖ ద్వారంగా 44వ జాతీయ రహదారి పక్కన విస్తరించి ఉన్న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గేటెడ్ కమ్యూనిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అనువైన రవాణా సౌకర్యం, మున్సిపాలిటీ చుట్టూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పాఠశాలలు ఉండటంతో పెద్ద ఎత్తున విల్లాస్, అపార్టుమెంట్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి.
పదికి మించి గేటెడ్ కమ్యూనిటీలు
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు వెలిశాయి. 44వ నంబరు జాతీయ రహదారి పక్కన మైఫీ, ప్రెస్టేజ్ పార్కు, కొంపల్లి నుంచి గుండ్లపోచంపల్లి దారిలో నైబర్‌హుడ్, ఉర్జితా 1, 2 3, ఆంథమ్ విల్లాస్, అపర్ణ కెనాపీ, పామిడోస్, అబ్రోస్, ట్రైడెంట్ తదితర గేటెడ్ కమ్యూనిటీలు ఆధునిక సౌకర్యాలతో వెలిశాయి. నగరంలో సొంత ఇండ్లు ఉన్నవారు సైతం గుండ్లపోచంపల్లి పరిధిలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండటానికి అమితాసక్తి చూపుతున్నారు.
ఇక్కడే ఎందుకు..?
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నగర శివారులో జాతీయ రహదారి పక్కన ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొనే అధికారులు, ఉద్యోగులు ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. ఇందుకు ఇక్కడ వెలిసిన గేటెడ్ కమ్యూనిటీలు వంద శాతం అనుకూలంగా ఉన్నాయి. గచ్చిబౌలి, హైటెక్‌సిటీలో పని చేసే ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నగరానికి వందల కిలో మీటర్ల దూరంలో ఉంటూ నగరానికి వచ్చే, వెళ్లే ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. రింగురోడ్డు, జాతీయ రహదారి, రైల్వేస్టేషన్ తదితర రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉండటంతో ఎక్కడి నుంచైనా ఇక్కడికి రావడం, వెళ్లడం సులభంగా మారింది.
అంతేకాదు భద్రత, గృహ సంబంధిత పనులకు అవసరమైన టెక్నిషియన్లు, పనివాళ్లు కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో అందుబాటులో ఉండటంతో ప్రాధాన్యతనిస్తున్నారు. 6 కిలో మీటర్ల పరిధిలో సుచిత్ర సర్కిల్ లోపలే సూపర్మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, హోటళ్లు, ఇతరత్రా ఏ పనులకైనా వాణిజ్య సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేవు. దీంతో నగరంలో సొంత ఇండ్లు ఉన్న వారు కూడా గుండ్లపోచంపల్లికి వచ్చి విల్లాలను కొనుగోలు చేయడం లేదా అద్దెకు ఉంటున్నారు.
మున్సిపాలిటీకి ఆదాయ వనరు..
మున్సిపాలిటీకి గేటెడ్ కమ్యూనిటీలు ఒక ఆదాయ వనరుగా మారాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించే కమ్యూనిటీవాసులు ఆస్తి పన్ను చెల్లింపులో కూడా అదే క్రమశిక్షణ పాటిస్తారు. క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నారు. దీంతో ఇది కూడా ఒక ఆదాయ వనరుగా మారింది. ఇక్కడ ఉన్న డిమాండ్ దృష్ట్యా రియల్ ఎస్టేట్ సంస్థలు తమ నిర్మాణాలను విస్తరిస్తున్నాయి.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Gundlapochampally
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

