శుక్రవారం 05 మార్చి 2021
Medchal - Jan 19, 2021 , 23:16:36

చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం

చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం

  • ఈ నెల 22 నుంచి 29 వరకు ఉత్సవాలు
  • ప్రతియేడు సంక్రాంతి తర్వాత వచ్చే రెండో ఆదివారం జాతర 

గాజులరామారం, జనవరి 19 :    నాలుగు దశాబ్దాలుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గాజులరామారం శ్రీ చిత్తారమ్మ జాతరకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత వచ్చే రెండో ఆదివారం అమ్మవారి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దీనిలో భాగంగా ఈ నెల 22 శుక్రవారం నుంచి 29 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. 

ఉట్టిపడనున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు..

శ్రీ చిత్తారమ్మ జాతరలో మొదటి రోజు ఉదయం 8గంటలకు గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్యప్రాశన, దీక్షాధారణ మండపారాధన, అగ్నిప్రతిష్ఠాపన, రెండోరోజు శనివారం గవ్యాంత పూజలు, మూలమంత్రజపము, అవాహియ దేవతాహోమాలు, పూర్ణాహుతి, బలిప్రదానం, రుత్విక్‌ సన్మానం. మూడోరోజు ఆదివారం అమ్మవారి ప్రధాన జాతరలో భాగంగా ఉదయం 3గంటలకు అభిషేకం, 4గంటలకు విజయ దర్శనం, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణతో పూజలు ప్రారంభమవుతాయి. 11గంటలకు భక్తులు అమ్మవారి మొక్కులు చెల్లించుకునేందుకు భోనాలు, ఒడిబియ్యం సమర్పిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు పోతరాజుల నృత్యాలు, శివసత్తుల సిందులతో అమ్మవారి ఊరేగింపు  ఉంటుంది. రాత్రి 9గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో బుర్రకథ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నాలుగోరోజు సోమవారం ఉదయం 11గంటలకు రంగం (దివ్యవాణి), మంగళ, బుధ, గురువారాలలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. చివరిరోజు 29న శుక్రవారం అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడిబియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

VIDEOS

logo