టీఆర్ఎస్తోనే అభివృద్ధి

గాజులరామారం: బస్తీలు, కాలనీల ప్రగతికి డిల్లీ పార్టీల పెత్తనం అవసరామా.. టీఆర్ఎస్ పార్టీతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని గాజులరామారం డివిజన్ టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్‌చంద్రబోస్‌నగర్, రుడామేస్త్రీనగర్లో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ బస్తీల అభివృద్ధిని గాలికొదిలేసి ఇప్పుడు ఎన్నికలు రాగానే మేమే అభివృద్ధి చేస్తామంటూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. గడిచిన ఐదేండ్లలో కాలనీలు, బస్తీల్లో దాదాపు రూ.170 కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి కార్పొరేటర్‌గా రావుల శేషగిరిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్యే వివేకానంద్
టీఆర్ఎస్ ప్రజల సంక్షేమ ప్రభుత్వమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శుక్రవారం వారు డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కొలుకుల జగన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడారు. జగద్గిరిగుట్ట డివిజన్ అభివృద్ధికి గడిచిన ఐదేండ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధికి అడుగడునా అడ్డుపడుతున్న బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని స్పష్టం చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కొలుకుల జగన్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం యువకులు పెద్ద సంఖ్య లో బైక్ ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు.
తాజావార్తలు
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్‌లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
- పీఈటీల అప్‌గ్రేడేషన్ చేపట్టాలి
- మహా మానవహారానికి మద్దతు
- వ్యాక్సినేషన్ కేంద్రాల పెంపు
- నిజాంసాగర్ డీ-40 కాలువ పరిశీలన