జహీరాబాద్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ జహీరాబాద్‌కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గురువారం సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
సభకు సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. సభలో జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను ఉత్సాహపరిచారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు జై తెలంగాణ, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు.