పాలిటెక్నిక్ విద్యార్థులకు పురుగుల అన్నం
నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి.
- సరైన భోజనం పెట్టడం లేదని, మెనూ అమలు కావడం లేదంటున్న విద్యార్థులు
- పురుగుల అన్నం, నీళ్లచారుతో ముద్ద దిగడం లేదని ఆవేదన
- గోమారం పాలిటెక్నిక్ హాస్టల్లో అన్నీ సమస్యలే
శివ్వంపేట, ఆగస్టు 26: నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి. పాలిటెక్నిక్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 45 మంది విద్యార్థులు వసతి గృహంలో, మిగిలిన విద్యార్థులు బయట నుంచి వస్తుంటారు.

హాస్టల్ విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ అటాచ్డ్ హాస్టల్ కాకుండా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉండడంతో కూరగాయల కోసం ప్రతినెలా రూ. 2200 నుంచి 2400 వరకు ఖర్చులు అవుతున్నాయని విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. విద్యార్థులు నెలనెలా డబ్బులు కడుతున్నప్పటికీ నాణ్యమైన భోజనం పెట్టడం లేదు.
అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. సరైన ఆహారం అందక చదువుపై దృష్టిపెట్టలేక పోతున్నామని, హాస్టల్, కళాశాలకు ప్రహరీ లేదని, గేటు కూడా లేదని, హాస్టల్ ఎదుట విద్యుత్ స్తంభాలకు కు లైట్లు లేక రాత్రిళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

