ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం
రెడ్డిపల్లి త్రిఫులార్ పరిహారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తానని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు.
- నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి రైతులతో సమావేశం
మెదక్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రెడ్డిపల్లి త్రిఫులార్ పరిహారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తానని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి రైతులు మాట్లాడుతూ గ్రామ వ్యవసాయ భూమి త్రిఫుల్ఆర్లో పోతుందని, దాని వల్ల ప్రజలకు తీవ్రనష్టం కలుగుతుందని, త్రిఫుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని, పరిహారం పెంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెడ్డిపల్లి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తానన్నారు. అలైన్మెంట్ మార్చడం వీలుకాదని, అయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్తానని, పరిహారం పెంపు విషయంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. రైతులందరూ సమన్వయంతో ఉండాలన్నారు. పరిహారం పెంపు విషయంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, సత్యనారాయణ గౌడ్, మహేశ్ గౌడ్, సత్యనారాయణ, నిరంజన్, నగేశ్‌గౌడ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

