సిద్దిపేట అర్బన్, జూన్ 24: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్ఐ పోలీస్ ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం తెలిపారు. ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన 4,409 మంది అభ్యర్థులకు.. 3,926 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 483 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. వెరిఫికేషన్ నోడల్ అధికారిగా నియమించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కొనసాగిందన్నారు.
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా జరిగిందన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో సూపరింటెండెంట్లు జమీల్ పాషా, మహ్మద్ ఫయాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, సీనియర్ అసిస్టెంట్లు సతీష్, సాగర్, శ్రీధర్, ఐటీ కోర్ ఎస్ఐ శ్రీకాంత్, ఆర్ఎస్ఐ పుష్ప, ఆర్ఐ శ్రీధర్‌రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.