అమల్లోకి ఎన్నికల కోడ్
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు.
- జిల్లాలో 4,34,900 మంది ఓటర్లు
- 764 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
- 24 గంటల్లోపు పార్టీలు ఫ్లెక్సీలు తొలిగించాలి
- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
- రంగంలోకి ఫ్లయింగ్ స్వాడ్లు , స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు
- ఫిర్యాదులకు విజిల్ యాప్, కంట్రోల్ రూమ్ 1950
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా
- సరిహద్దులో 5 చెక్ పోస్టులు
- ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని ప్రకటించడంతో జిల్లాలో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిందని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడ్ నియమ, నిబంధనల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,34,900 మంది ఓటర్లున్నారని, కొత్తగా 15,715 మంది యువత ఓటు హక్కు పొందారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 764 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మున్సిపల్, పంచాయతీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు పెట్టుకోవడానికి, వాహనాలు, హెలికాప్టర్లు వినియోగించుకోవడానికి సువిధ యాప్ ద్వారా అనుమతి పొందాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ అక్రమంగా మద్యం, నగదు రవాణాను నియంత్రించేందుకు సరిహద్దుల్లో ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 9
మెదక్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం గా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉం టుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజ ర్షి షా తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతిఒకరూ సహకరించాలని కోరా రు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు.
ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేరొన్నారు. మత సంబంధమైన ప్రదేశా ల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచా రం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లాలో 4,34,900మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,10,209 మంది కాగా, మహిళలు 2, 24,680 మంది ఉన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,14,118 మంది ఉండగా, పురుషులు 1,02,359 మంది కాగా, మహిళలు 1,11,755 మంది ఉన్నా రు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,782 మంది ఉండగా, అందులో పురుషులు 1,07,850 మంది కాగా, మహిళలు 1,12,925 మంది ఉన్నారు. అయితే మెదక్ నియోజకవర్గంలో పీడబ్యూడీ ఓటర్లు 3934 మంది కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 4948 మంది ఉన్నారు.
మొత్తం గా జిల్లాలో 8882 మంది ఉన్నారు. అయితే 80 సంవత్సరాలు దాటిన వారు జిల్లాలో 4165 మంది ఉండగా, అందులో మెదక్ నియోజకవర్గంలో 2448 మంది కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 1717 మంది ఉన్నారు. అయితే ఈసారి కొత్తగా 18-19 సంవత్సరాల యువతీ,యువకులు 15, 715 మంది ఓటుహకును వినియోగించుకోనున్నారు. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 7889 మంది కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 7826 మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో 764 పోలింగ్ స్టేషన్లు ఉండగా, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 579 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
24 గంటల్లోగా ఫ్లెక్సీలు తొలిగించాలి
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సం బంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోగా తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్, పంచాయతీ చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు అయ్యేవరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యంత్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రవర్తనా నియమావళి అమలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమ లుచేసేందుకు అవసరమయ్యే బృందాలను రంగంలోకి దించుతామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం మూడు ఫ్లయింగ్ స్వాడ్లు, మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ పార్టీలు, పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను రికార్డిం గ్ చేయాలని సూచించారు. ఎకడైతే అక్రమ డబ్బు చలామణి, మద్యం సరఫరా వంటివి జరుగుతున్నాయో గుర్తించి అకడకు ఈ టీంలను పంపించి వీడియో చిత్రీకరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో అక్ర మాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ పై ఫిర్యాదులు చేయడానికి సీవిజిల్ యాప్‌తోపాటు కంట్రోల్ రూం 1950 ఏర్పాటు చేశామన్నారు.
రిటర్నింగ్ ఆఫీసర్లు పర్యవేక్షణ
జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ టీమ్ నియోజకవర్గంలో బృందాలుగా తనిఖీలు చేస్తారని చెప్పారు. విడతల వారీగా మూడు బృందాలు ఉదయం 8 గంటల నుంచి, మధ్యాహ్నం 2గంటల వరకు, 2 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు, రాత్రి10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బృందాలు పర్యవేక్షణ చేస్తుంటాయన్నారు.
సువిధ యాప్‌ను వినియోగించుకోవాలి
రాజకీయ పార్టీలు పర్మిషన్ తీసుకునే విధంగా అందుబాటులోకి సువిధ యాప్ ఉంది. వాహనాలు, హెలికాప్టర్, హెలీప్యాడ్, సౌండ్స్, ర్యాలీలు, సభలు, పెట్టుకోవడానికి సువిధ ఆన్లైన్ యాప్‌లో అప్లయ్ చేసుకోవాలి. సీవిలేజ్ కొత్తగా యాప్ అందుబాటులో ఉం టుంది. ఎకడైనా సమస్యాత్మక ప్రాంతాలు, అనుకుంటే అకడే ఒక ఫొటో, వీడియో తీసి పంపిస్తే.. లొకేషన్తోసహా ఎలక్షన్ ఆఫీసర్లు చేరుతుంది. ఎవరు పంపారు అనేది తెలియకుండా ఉంటుంది.
జిల్లా సరిహద్దులో 5 చెక్ పోస్టులు
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియామవళిని కచ్చితంగా అమలు చేస్తామని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేరొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టామన్నా రు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

