సంక్షేమ హాస్టళ్లు..సమస్యలకు నిలయాలు
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో 300 మంది విద్యార్థులు ఉంటున్నారు.
- పక్కా భవనాలు లేక విద్యార్థుల అవస్థలు
- ఐదు నెలలుగా అందని డైట్‌చార్జీలు
- పంపిణీ చేయని నోట్‌బుక్స్,యూనిఫామ్స్, దుప్పట్లు
- విద్యార్థులకు తప్పని తిప్పలు
సిద్దిపేట, జూలై 24: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో 300 మంది విద్యార్థులు ఉంటున్నారు. విద్యా సంవత్స రం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నోట్‌బుక్స్, బెడ్ షీట్స్, కార్పెట్లు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు. దీనికి తోడు ఐదు నెలల నుంచి డైట్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయలేదు.
సిద్దిపేట బీసీ హాస్టల్..
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్‌కు పక్కా భవనం లేక అద్దె భవనంలోనే కొనసాగుతున్నది. రెండు స్నానపు గదులు, రెండు టాయిలెట్స్ మా త్రమే ఉన్నాయి. ఉదయం విద్యార్థులు స్నానాలు చేసేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్వాహకులు ప్రభుత్వ మెనూ పాటించడం లేదు. సిద్దిపేట పట్టణంలోని బీసీ బాలుర కాలేజీ విద్యార్థుల హాస్టల్‌కు సొంత భవనం లేదు. వందమంది విద్యార్థులు ఉంటున్నా నీటి సరఫరా లేక విద్యార్థులు బకెట్లలో నీళ్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
డైట్ చార్జీలు రాక ఇబ్బందులు పడుతున్నాం
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో 300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఐదు నెలల నుంచి ప్రభుత్వం డైట్‌చార్జీలు విడుదల చేయ లేదు. దీంతో విద్యార్థులకు భోజనాన్ని వడ్డించేందుకు అపుతెచ్చి ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకో విద్యార్థికి రూ.1050 చొప్పున డైట్‌చార్జీలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు విడుదల చేయక ఇబ్బందిగా మారింది.
-మల్లేశం, వార్డెన్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్, సిద్దిపేట
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

