ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట,అల్లాదుర్గం, రేగోడ్ పీఎస్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలోని రికార్డులు, పట్టుబడిన వాహనాలను ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు జవాబుదారీగా పనిచేస్తూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు.
- పోలీసులు జవాబుదారీగా పనిచేయాలి
- మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
అల్లాదుర్గం,పెద్దశంకరంపేట , రేగోడ్, జూలై14: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట,అల్లాదుర్గం, రేగోడ్ పీఎస్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలోని రికార్డులు, పట్టుబడిన వాహనాలను ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు జవాబుదారీగా పనిచేస్తూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు.
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను ఓపికతో విని పరిష్కరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. డ్రగ్స్,మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు నిరంతరం వాహనాల తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ రాజేశ్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్ ఎస్సైలు ప్రవీణ్‌రెడ్డి,శంకర్, రాజయ్య,ఏఎస్సై మల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

