మహర్షి వాల్మీకి జీవితం ఆదర్శనీయం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు.
మెదక్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పురాణ గాథల ప్రకారం తొలినాళ్లలో రత్నాకరుడిగా పేరొందిన వాల్మీకి దారి దోపిడీలకు పాల్పడేవారని, సప్తర్షుల బోధనలతో ఆత్మపరిశీలన చేసుకుని తన జీవితాన్ని మార్చుకున్నారని పేర్కొన్నారు. అనంతరం కఠోర తపస్సుతో మహర్షిగా ఎదిగి ఆదికావ్యమైన రామాయణాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పారని తెలిపారు.
మనిషి తన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ సన్మార్గంలో నడవాలని సంకల్పించుకుంటే జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని వాల్మీకి జీవితం నిరూపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ మహర్షి వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సత్ప్రవర్తనతో మెలుగుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, డీఎస్పీ రంగనాథ్, ఆర్ఐ శైలేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

