Rayapol | జాతీయ లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్ఐ కుంచం మానస
జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట జిల్లా రాయపోలు ఎస్ఐ కుంచం మానస గురువారం తెలిపారు.
రాయపోల్,మార్పి 26 : జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట జిల్లా రాయపోలు ఎస్ఐ కుంచం మానస గురువారం
తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్చి 28న నిర్వహించనున్న ఈ లోక్ అదాలత్ చిన్న చిన్న కేసులకు తక్షణ పరిష్కారం అందించే వేదికగా నిలుస్తుందని సూచించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకునే పరిస్థితి నుంచి బయటపడేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం అని ఆమె పేర్కొన్నారు. కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, చెక్ బౌన్స్ కేసులు వంటి వివిధ రాజీ పడదగిన కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని సంప్రదించి ఇరువర్గాలు పరస్పరం రాజీకి రావచ్చని అన్నారు. ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారితో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

