Rayapol police | విధి నిర్వహణకు గుర్తింపు.. పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు
విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు సిద్ధిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు దుంపలపల్లి స్వామి, ఘనపురం వికాస్ రెడ్డిలకు ప్రశంసా పత్రాలు లభించాయి.
రాయపోల్ : నవంబర్ 05 : విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు సిద్ధిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు దుంపలపల్లి స్వామి, ఘనపురం వికాస్ రెడ్డిలకు ప్రశంసా పత్రాలు లభించాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమల్ చేతుల మీదుగా వారు ఈ ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు స్వామి, వికాస్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవలను గుర్తించి తమను అభినందించడం మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను ఇచ్చిందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంపొందించేలా భవిష్యత్తులోనూ మరింత బాధ్యతతో పనిచేస్తామని పేర్కొన్నారు. తమ సేవలను గుర్తించి ప్రోత్సహించిన పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమల్కు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తమ విధి నిర్వహణలో మరింత నిబద్ధతతో ముందుకు సాగేందుకు దోహదపడుతుందని వారు వెల్లడించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

