కాంగ్రెస్ నాయకులకు కరువు కనిపించడం లేదా? ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ఒకవైపు ఎండిపోతున్న పంట పొలాలు.. మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఇంకోవైపు రబీ సాగుపై నీలినీడలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు దుబ్బాకలో నెలకొన్న కరువు పరిస్థితులు కనిపించడం లేదా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
తొగుట: ఒకవైపు ఎండిపోతున్న పంట పొలాలు.. మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఇంకోవైపు రబీ సాగుపై నీలినీడలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు దుబ్బాకలో నెలకొన్న కరువు పరిస్థితులు కనిపించడం లేదా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. రైతుల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం తొగుట మండలంలోని వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి, చందాపూర్, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఘనపూర్, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు రబీ సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలను నింపకుండా రైతులకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. రాజకీయ కక్షలు, విమర్శలు పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తే దుబ్బాకలో ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. మల్లన్నసాగర్‌ను గోదావరి జలాలతో నింపి ఉపకాలువలు నిర్మిస్తే రైతులకు రబీ సాగుకు భరోసా లభించేదన్నారు.
గతంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు దుబ్బాక నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. నేడు అంతకంటే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతులకు ఆర్థిక సహాయం, పంట రుణాల రీషెడ్యూల్, పశుసంపద పరిరక్షణ, పంటల సాగుకు ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి, ఐకేపీ ఏ పీ ఎం బాబురావు, సర్పంచ్ లు కన్నయ్యగారి లక్ష్మి, బండారు కవిత స్వామి గౌడ్, బక్క కనకయ్య, చందా లావణ్య స్వామి, పన్యాల ప్రవీణ్ రెడ్డి, కోల వెంకట స్వామి గౌడ్, గంగసాని రాజిరెడ్డి, నంట సమీరా పరమేశ్వర్ రెడ్డి, నాయకులు చిరువేరి మల్లారెడ్డి, బోధనం కనకయ్య, వేల్పుల స్వామి, కొమ్ము శరత్, మల్లయ్య, శివయ్య, బొడ్డు భూమయ్య, పెంటోజీ, కంది రాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కోల కనకయ్య, శ్రీనివాస్, పర్శరాములు, బైరాగౌడ్, రమేష్, మల్లేశం, అరుణ్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, నీల రాజయ్య, గురువా రెడ్డి, దుబ్బాక కనకయ్య, పరమేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి, యాదగిరి, శ్రీనివాస్ ఉప సర్పంచ్ లు, ఐకేపీ, సొసైటీ ప్రతినిధులు, రైతులు, నాయకులు తదితరులు ఉన్నారు..
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
Niranjan Reddy | వనపర్తి ఇరిగేషన్ సీఈ ఆఫీస్ ఎదుట రైతులతో నిరంజన్ రెడ్డి ధర్నా.. వీడియో
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

