Siddipet : రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలి

సిద్దిపేట అర్బన్ : జిల్లాలోని రైతులు ఆయిల్‌పామ్ తోటల సాగుపై దృష్టి సారించాలని జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా పరిషత్ 2, 3, 4వ స్థాయి సంఘాలైన వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, విద్య వైద్యం సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉందని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
జిల్లాలో ఆయిల్‌పామ్ తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విరివిగా సాగు చేయాలన్నారు. మంత్రి ప్రోత్సాహం, జిల్లా అధికారుల కృషితో ఇప్పటివరకు సుమారు వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలను నాటడం జరిగిందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, సుకూరి లక్ష్మి, శెట్టి మల్లేశం, కొండల్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సలీం, రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

