సిద్దిపేట : సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, కూతురు వైష్ణవి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ కొండం కవిత, సుడా డైరెక్టర్ సతీమణి మచ్చ విజిత, హౌసింగ్ బోర్డు సొసైటీ కాలనీలోని ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి కోలాటం, ఉయ్యాల పాటలతో ఆడిపాడారు.