బాల్య వివాహాలు, చెడు వ్యసనాలపై అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కనువిప్పు కళాబృందం సభ్యులు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రాయపోల్, అక్టోబర్ 9 : గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కనువిప్పు కళాబృందం సభ్యులు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, గంజాయి వినియోగం, మత్తు పదార్థాలు, ఇతర చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామస్తుల్లో చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల పిల్లల భవిష్యత్తుపై పడే ప్రభావం, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళాబృందం సభ్యులు వివరించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడటం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవనంపై పడే దుష్ప్రభావాలను తెలియజేశారు. సామాజిక సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించి, సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదప డతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్, ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

