ఆగి ఉన్న ఢీసీఎంను ఢీకొట్టిన ఆటో.. వ్యక్తికి తీవ్రగాయాలు
క్రైం న్యూస్ | ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టిన సంఘటన చిన్నకోడూరు మండలం రామునిపట్ల రాజీవ్ రదారిపై ఆదివారం చోటు చేసుకుంది.

చిన్నకోడూరు, అక్టోబర్ 17 : ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టిన సంఘటన చిన్నకోడూరు మండలం రామునిపట్ల రాజీవ్ రదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోహెడ మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో రోజు మాదిరిగానే కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్దిపేటకు తన ఆటోలో వెళుతున్నాడు.
అతి వేగంగా ఉన్న ఆటో రామునిపట్ల గ్రామ శివారులోకి రాగానే రాజీవ్ రహదారి పై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు బలమైన గాయం కాగా కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జయింది. స్థానికులు ప్రమాద విషయాన్ని 108 సిబ్బందికి సమాచారం అందివ్వడంతో ప్రవీణ్ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

