సిద్దిపేట, నవంబర్ 10: బీఆర్ఎస్ హ యాంలో ఏర్పాటు చేసిన సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ కళాశాలకు మరో 8 పీజీ సీట్లు మం జూరైనట్లు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాలలో మొదట్లో 13 సీట్లతో పీజీ కోర్సులు పారంభించుకోగా, అన్ని స్పెషాలిటీ కోర్సులు ఏర్పా టు చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి కొన్ని కోర్సులు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు.
కొత్తగా రేడియాలజీలో 4 సీట్లు, ఆర్థోపెడిక్‌లో 4 పీజీ సీట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 75 పీజీ సీట్లు ఉండగా ,ఈ 8 సీట్లతో 83కు పెరిగాయని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో 18 స్పెషాలిటీ పీజీ కోర్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉస్మానియా, గాంధీ, వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల తర్వాత సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలోనే అత్యధిక పీజీ కోర్సులు ఉన్నాయని సంతోషాన్ని హరీశ్‌రావు వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు పీజీ సీట్లను సద్వినియోగం చేసుకోవాలని హరీశ్‌రావు కోరారు.