క్రీడా ప్రాంగణాలు శుభ్రంగా ఉంచుకోవాలి
గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను శుభ్రంగా ఉంచి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామాభివృద్ది కార్యక్రమాలైన తెలంగాణ క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, నర్సరీ, వైకుంఠధామాలు, పల్లె బృహత్ ప్రకృతి వనం లాంటి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో
- జీపీ భవనాలు పూర్తి చేయాలి
- సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి
- పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 22 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను శుభ్రంగా ఉంచి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామాభివృద్ది కార్యక్రమాలైన తెలంగాణ క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, నర్సరీ, వైకుంఠధామాలు, పల్లె బృహత్ ప్రకృతి వనం లాంటి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఏ, డీపీవోలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను అన్ని సదుపాయాలతో పూర్తి చేయాలన్నారు. నర్సరీల్లో మొక్కలను వచ్చే హరితహారం నాటికి సిద్ధం చేయాలన్నారు. వైకుంఠధామాలలో ఎలక్ట్రిసిటీ, నీటి వసతి, మరుగుదొ డ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, జిల్లాలో డీఆర్డీఏ, డీపీవో అధికారులు కలెక్టర్ సూచించిన విధంగా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ క్రీడా ప్రాంగణం శుభ్రంగా ఉంచి.. ఆటల పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర పల్లె ప్రగతి పనులు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, డీపీవో దేవకీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

