Power cuts | గంటకోసారి కరెంట్ కట్ .. ఇబ్బందులు పడుతున్న మండల వాసులు
మునిపల్లి మండలంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి రోజు గంటకోసారి కరెంట్ కట్ కావడంతో సరైన కరెంట్ సరఫరా లేక స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు.
మునిపల్లి, అక్టోబర్ 15 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి రోజు గంటకోసారి కరెంట్ కట్ కావడంతో సరైన కరెంట్ సరఫరా లేక స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలంలో గంటకోసారి కరెంట్ కట్ అవ్వడం ప్రతిరోజు ఉండడంతో మండల వాసులకు అవస్థలు తప్పడం లేదు. మండల కేంద్రమైన మునిపల్లితో పాటు మండలంలోని కంకోల్,తాటిపల్లి, పెద్దలోడి గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేష్న్లు ఉన్నాయి. మండలంలో కరెంట్ అధికారుల కోరత ఉండడంతో ఎన్నడలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప పరిష్కారం అవడం లేదనే విమర్శలు గట్టిగ వినిపిస్తున్నాయి.
మునిపల్లి మండల విద్యుత్ అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మండల వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలవక సతమతమవుతున్నారు. మండలంలో విద్యుత్ అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో కరెంటు సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మునిపల్లి మండల విద్యుత్ అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో కిందిస్థాయిలోని ఓ అధికారికి ఉన్నత అధికారుల పెత్తనం ఇవ్వడంతో ఆ అధికారి ఆడిందే…ఆట పాడిందే పాట అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు పలు రకాలు విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మండలంలో సరైన విద్యుత్ అధికారులు లేకపోవడంతో మునిపల్లి మండలంలో కరెంటు సరఫరా కరెక్ట్ లేదంటున్నారు…అధికారులు స్పందించి మునిపల్లి మండలానికి నూతన విద్యుత్ అధికారిని నియమించి మండల వాసులు ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.
12మందికి 8మందే
అయ్యా గ్రామాల్లోని సబ్ స్టేషన్లలో పనిచేసేందుకు 12 మంది ఆపరేటర్లు ఉండాల్సి ఉన్నప్పటికీ ఎనిమిది మంది ఆపరేటర్లతో పని చేస్తూన్నారు. ఆపరేటర్ల కొరత ఉండడంతో ప్రైవేట్ వ్యక్తులను విద్యుత్ ఆపరేటర్లుగా నియమించి పనిచేస్తున్నట్లు సమాచారం. అవగాహన లేని ఆపరేటర్లతో పనులు చేయించడం వల్ల ఏదైనా సమస్యలు ఏర్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారని మండల వాసులు అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మునిపల్లి మండలంలో 15మంది లైన్మెన్ లో ఉండాల్సింది కేవలం 7,8 మంది లైన్మెన్ లతో విధులు నిర్వహిస్తున్నరు.
ఎల్సీల పేరుతో కరెంట్ కట్
మండలంలో పనిచేస్తున్న అయా గ్రామాల లైన్మెన్లు ఎల్సీల పేరుతో ఆస్తమానం కరెంటు కట్ చేస్తున్నట్లు మండల వాసులు చెప్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకున్నా పనులు చేస్తున్నట్టు ఎల్సీలు తీసుకొని గంటల తరబడి కరెంట్ కట్ చేయడం వెనుక మండల వాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 30 గ్రామాల్లో (11)వేలకు పైగా విద్యుత్ కలెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులపై చూపిస్తున్న ఆసక్తి కరెంటు సమస్యలపై ఏందుకు చూపించడం లేదని విమర్శలు మండలంలో కోడైకొస్తున్నాయి. మునిపల్లి మండలంలో కిందిస్థాయి అధికారి నెల నెల వేతనం తీసుకుంటూ టైంపాస్ చేస్తూ ప్రభుత్వం అందించే జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కిందిస్థాయి అధికారులను ఇబ్బందులు గురి చేస్తున్నట్లు పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గ్రామాలకు ఒక్క లైన్మెన్లను ఏర్పాటు చేయాలి. కానీ, ప్రస్తుతం మునిపల్లి మండలంలో 4,5గ్రామాలకు ఒక లైన్మెన్ విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు లైన్ మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన కరెంట్ ఏఈ ని నియమించాలి
మునిపల్లి మండల కరెంట్ ఏఈ సరైన విధులు నిర్వహించకపోవడంతో మండల వాసులు పడుతున్న ఇబ్బందులను జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నూతన ఏఈని నియమించాలాని మండల వాసుల అధికారులను కోరుతున్నారు. కరెంట్ కట్ సమస్యపై వివరణ కోరెందుకు సంబంధిత ఏఈకి ఫోన్ చేస్తే జమాల్ అనే సిబ్బంది మాట్లాడుతూ మునిపల్లి మండలంలో విద్యుత్ అధికారులే లేరు… ఉన్నవాళ్ళతో సర్దుకు పోతున్నాం అని వివరణ ఇచ్చారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

