పుల్కల్ రూరల్,సెప్టెంబర్ 27 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. సోమవారం మూడు గేట్ల ద్వారా 35190 క్యూసెక్కుల నీటిని గేట్లను 2 మీటర్లు ఎత్తి అధికారులు దిగువకు వదులుతున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లు గానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని ఏఈ మజార్ మహమ్మద్ తెలిపారు తెలిపారు.